![]() |
![]() |

నిరంజన్, డెబ్జాని మోడక్ జంటగా నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ `ఎన్నెన్నో జన్మల బంధం`. బుల్లితెరపై కొంత కాలంగా ప్రసారం అవుతున్న ఈ సీరియల్ మహిళా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇతర పాత్రల్లో బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీథర్, ప్రణయ్ హనుమండ్ల, బేబీ మిన్ను నైనిక, సుమిత్ర, రాజా శ్రీధర్ తదితరులు నటిస్తున్నారు. ప్రతీ వారం ట్విస్ట్ లు, మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ఆకట్టుకుంటోంది. ఈ సోమవారం ఎలాంటి మలుపులు తిరగనుందో చూద్దాం.
కైలాష్ పన్నిన కుట్ర కారణంగా వేద, యష్ ఒకరికొకరు దూరమవుతారు. ఇదే మంచి అదనుగా భావిస్తున్న మాళవిక - అభిమన్యు.. ఖుషీని కూడా యష్ కు దూరం చేయాలని ప్లాన్ లు వేస్తుంటారు. వేద తనకు దూరం కావడంతో యష్ ఎలా తనని నిజాయితీని నిరూపించాలని ఆలోచిస్తుంటాడు. తను లేకసోవడంతో ఖుషీ ఎక్కడ ఇబ్బంది పడుతుందోనని బాధపడుతుంటాడు. ఖుషీని తనకి మళ్లీ దగ్గరచేస్తానని అంటాడు. అలాగే చేస్తాడు. అయితే మాలిని వెళ్లి ఖుషీని ఇంటికి రమ్మంటుంది. ఖుషీ వెళ్లనంటుంది. కానీ వేద తనని బుజ్జిగించి ఇంటికి వెళ్లేలా చేస్తుంది.
కట్ చేస్తే వేద, యష్ విడిపోయారని సంబరాలు చేసుకుంటున్న అభి.. యష్ ని మరో దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తాడు. ఖుషీని తనకి దూరం చేయాలని మాళవికకు చెబుతాడు. ఈ విషయంలో ఫ్యామిలీ కోర్టు జడ్జిని రంగంలోకి దింపాలని అభి చెబుతాడు. తను చెప్పినట్టే ప్లాన్ చేసిన మాళవిక ఫ్యామిలీ కోర్టు జడ్జితో కలిసి యష్ ఇంటికి వెళుతుంది. యష్ ని నిలదీస్తుంది. ఇంటికి వచ్చిన జడ్జ్ "మీ భార్య ఎక్కడ?" అని యష్ ని నిలదీస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
![]() |
![]() |